News

ఢిల్లీకి రానని చెప్పిన చంద్రబాబు


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి రానని తేల్చి చెప్పారు. గురువారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని ఢిల్లీలో ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేష్‌లకు బాబు ఫోన్ ద్వారా తెలిపారు. ఇదే విషయాన్ని వారు అరుణ్‌ జైట్లీకి చెప్పారు. దీంతో వారు చంద్రబాబు లేకుండానే ఫ్యాకేజీపై ప్రకటన చేసే అవకాశం ఉంది. బుధవారం సాయంత్రం అరుణ్‌ జైట్లీ మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. అంతకుముందు బుధవారం ఉదయం నుంచి ఏపీకి ప్రత్యేక సాయంపై కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు ప్రత్యేక చర్చలు జరిపారు. హోదా కన్నా మంచి ప్యాకేజీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. అదే విషయాన్ని వెంకయ్యనాయుడు చంద్రబాబుకు ఫోన్ ద్వారా వెల్లడించారు. అందులో కొన్ని అంశాలపై సూచనలు కూడా చేసినట్లు సమాచారం.